Anjali Arora opens up About Her Leaked MMS Controversy: కంగనా రనౌత్ షో 'లాక్ అప్'లో కనిపించిన అంజలి అరోరాకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. తాజాగా అంజలి పాడిన 'సైయా దిల్ మే ఆనా రే' పాట ఈ రోజుల్లో వైరల్ అవుతోంది. అయితే పాట విడుదలతో ఆమె వివాదంలో చిక్కుకుంది. అంజలి ఎంఎంఎస్ అనే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ మొత్తం విషయంపై అంజలి తన మౌనాన్ని వీడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారి స్వంత కుటుంబంలో ఎవరికైనా ఇలా జరిగితే వారు ఎలా భావిస్తారని వీడియో వైరల్‌ చేసిన వారిని ప్రశ్నించింది. కొత్త ఇంటర్వ్యూలో వీడియో గురించి మాట్లాడుతూ, అంజలి భావోద్వేగంతో ఏడ్చేసింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని, దీనిపై ఇప్పటికే తన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని కూడా అంజలి తెలిపారు. సిద్ధార్థ్ కన్నన్‌తో ఆమె వీడియోపై మాట్లాడుతూ నా పేరు పెట్టడం ద్వారా, నా ఫోటో పెట్టడం ద్వారా, ఇది అంజలి అరోరా MMS అని ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదని అన్నారు.


ఇలా చేసిన వారికీ ఓ కుటుంబం ఉంది, నాకూ ఓ కుటుంబం ఉంది అంటూ అంజలి ఏడ్చింది.  వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను, యూట్యూబ్‌లో పనికిమాలిన వ్యూస్ కోసం, అది అంజలి అరోరా ఎంఎంఎస్  అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారు. నాకు కూడా ఒక కుటుంబం ఉంది, నాకు ఒక సోదరుడు ఉన్నాడు, నాకు ఒక సోదరి ఉంది, ఇవన్నీ చూసే తమ్ముళ్లు నాకు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని ‘లాక్‌ అప్‌’ నుంచి రాగానే ఇంతకు ముందు కూడా ఇలాగే జరుగుతోందని తెలిసిందని అన్నారు.  


షో ప్రారంభమైన నాలుగో వారంలోనే ఇలాంటివి జరగడంతోపాటు ఆమె ముఖంతో ఉన్న కొన్ని నకిలీ వీడియోలు ప్లే అవుతున్నాయని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా వయసు కేవలం 21 సంవత్సరాలు, వీటన్నింటిని తట్టుకోగలిగేలా వీటన్నింటికీ నేను సిద్ధంగా లేనని ఆమె అన్నారు. ఎవరి గురించి అయినా ఇలాంటివి ప్రచారం చేయడం తప్పు అని అంజలి ఆవేదన వ్యక్తం చేసింది.


Also Read: Laal Singh Chaddha: మొదటి రోజు దారుణంగా వసూళ్లు.. ఆ జాబితాలో దక్కని చోటు!


Also Read: Naga Chaitanya: సమంత కనిపిస్తే వాటేసుకుంటా.. చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.